అహ్మదాబాద్‌ టెస్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 24/1..

-

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ నష్టానికి 24 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్‌ శుబమన్‌ గిల్‌ పరుగులు ఏమీ చేయకుండానే ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్‌ శర్మలు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కొనసాగుతుండగా, పుజారా 15 పరుగుల స్కోరు వద్ద క్రీజులో ఉన్నాడు.

india at 24 for 1 after completing day 1 at ahmedabad

మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో బెన్‌ స్టోక్స్‌, డాన్‌ లారెన్స్‌లు రాణించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 121 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో స్టోక్స్‌ 55 పరుగులు చేయగా, 74 బంతుల్లో 8 ఫోర్లతో లారెన్స్‌ 46 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు ఇదే వేదికపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో పింక్‌ బంతితో అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ మ్యాజిక్‌ చేయగా.. అదే జోరును ఈ ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. అతనికి అశ్విన్‌, సిరాజ్‌లు చక్కని సహకారం అందించారు. అశ్విన్‌ 3 వికెట్లు తీయగా, సిరాజ్‌కు 2, వాషింగ్టన్‌ సుందర్‌కు 1 వికెట్‌ దక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news