మరో కుర్ర హీరోతో సినిమా అనౌన్స్ చేసిన సుకుమార్

-

ఈ మధ్య కాలంలో ఒక పక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే సుకుమార్ సినిమా నిర్మాణం కూడా చేస్తున్నారు. తన దగ్గర పనిచేస్తున్న కుర్రాళ్ళని దర్శకులుగా తీర్చిదిద్దుతూ వారి కెరీర్ నిర్మించుకోవడానికి దోహద పడుతున్నాడు. అదే కోవలో ఆయన మొన్న ఉప్పెన అనే సినిమా చేయగా అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా ఆయన నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో కుర్ర హీరో తో సినిమా అనౌన్స్ చేశాడు.

హీరో కార్తికేయతో ఆయన సినిమా అనౌన్స్ చేశారు.  మార్చి 19న విడుద‌ల అవ్వ‌నున్న కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్ర‌సై సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై ఓ సినిమాను నిర్మించ‌డానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్లాన్ చేశారు. న‌వంబ‌ర్ లో ప్రారంభం అవ్వ‌నున్న ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు, త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news