షాకింగ్ : 12 కేజీల బంగారం పట్టివేత.. ఎక్కడ దాచారో తెలుసా ?

-

కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో ఒకే రోజు 12 కేజీల బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 9 మంది స్మగ్లర్ల అరెస్ట్ కాగా ఈ అంశం తీవ్ర కలకలం సృష్టించింది. గల్ఫ్ నుంచి వివిధ విమానాల్లో కేరళ చేరుకున్న తొమ్మిది మంది స్మగ్లర్ల నుంచి 5 కోట్ల విలువ చేసే బంగారం గుర్తించారు.  కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా తరలించే ప్రయత్నం చేసినా కస్టమ్స్ తనిఖీలో బంగారం అక్రమ రవాణా బయట పడ్డాయి.

దుబాయ్, షార్జా, దోహా, జెడ్డా, అబుదాబీ, రియాద్ నుంచి వచ్చిన స్మగ్లర్లు బంగారాన్ని మలద్వారం, జూసర్ మిక్సర్, కార్డ్ బోర్డ్ బాక్స్ లో దాచి గ్రీన్ ఛానెల్ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికి పోయారు. అక్రమ బంగారం గుట్టును రట్టు చేసిన కన్నూర్ కస్టమ్స్ అధికారులు బంగారాన్ని సీజ్ చేసి పట్టుబడ్డ తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news