ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో తర్వాతి ఎన్నికల కమిషనర్ ఎవరు అనేదానిమీద ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ముగ్గురు పేర్లతో గవర్నర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం, నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు సిఫారసు చేసింది.
ఈ నెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ పదవీకాలం పూర్తవుతుంది, ఈ నేపథ్యంలో గవర్నర్ ఎవరి పేరు ఫైనల్ చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి నీలం సాహ్ని పేరును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె గతంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో ఆమె ప్రస్తుతం ముఖ్యమంత్రికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమెను ఏది కోరి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా తీసుకు వచ్చిన జగన్ దాదాపుగా ఆమెకే ఈ పదవి ఖరారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అనే వాదన వినిపిస్తోంది.