యాపిల్ ఐఫోన్లను కొనాలని యోచిస్తున్న వినియోగదారులకు చేదు వార్త చెప్పింది యాపిల్. ఇకపై తమ ఐఫోన్లతో పాటు ఛార్జర్‌లు ఇవ్వడం ఆపేసింది. దీనిపై గత ఏడాదే ప్రకటించింది యాపిల్.
సాధరణంగా యాపిల్ ఫోన్ల ఛార్జర్లు ఖరీదైనవి. అయితే దీనిపై వివరణ ఇచ్చిన యాపిల్ యాజమాన్యం పర్యావరణ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాములుగా ఛార్జర్ అడాప్టర్లు తయారీకి ప్లాస్టిక్, రాగి, టిన్, జింక్ వంటి పదార్థలను వినియోగించాల్సి ఉంటుంది. యాపిల్ ప్రచురించిన ఎన్విరాన్‌మెంటల్ ప్రొగ్రెస్ నివేదిక ప్రకారం ఐఫోన్ బాక్స్‌లో ఛార్జర్‌ను చేర్చకపోవడం వల్ల దాదాపు 8.61 లక్షల టన్నుల రాగి, జింక్ ఇతర లోహాలను ఆదా చేయగలిగిందట. అదే విధంగా ఛార్జర్‌ను మినహాయించడం వల్ల యాపిల్ ఐఫోన్ బాక్స్ పరిమాణాన్ని సైతం తగ్గించింది. ఈ ప్యాకే జింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేసింది. అడాప్టర్లను ఇవ్వకపోవడం అనేది సాహసోపేతమైందే అయినా వీటి ఉపయోగానికి వాడే లోహాల మైనింగ్ వల్ల వెలువడే ఉద్గారాలను తగ్గించడం మన భూమికి చాలా అవసరమని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్ పేజీలో తెలిపింది.
గత ఏడాది నుంచే ఐఫోన్, యాపిల్ వాచ్ ప్యాకేజింగ్ నుంచి అడాప్టర్లను తొలగించినప్పట నుంచి
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం 2019 లో 25.1 మిలియన్ టన్నుల నుండి కార్బన్‌డైయాక్సైడ్ ఉద్గారాలను 22.6 మిలియన్లకు తగ్గించిందని నివేదిక హైలైట్ చేసింది.
యాపిల్ మాక్ పరికరాల కోసం 2020లో సొంతంగా M1 చిప్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని ఫలితంగా మొత్తం కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను 34% తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా 8వ తరం ఐప్యాడ్‌తో మరింత శక్తి–సమర్థవంతమైన ఛార్జర్‌కు కూడా మారిందని యాపిల్ తెలిపింది .దీనికి ఎనర్జీ స్టార్ రేటింగ్ అవసరం కంటే 66% తక్కువ శక్తి అవసరమవుతుంది. గత 12 సంవత్సరాల్లో, దాని ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ శక్తిని తగ్గించినట్లు కంపెనీ తెలిపింది.