LIC పాలసీదారులకు అలర్ట్… కొత్త రూల్స్ ఇవే…

-

LIC పాలసీదారులు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. కొత్త రూల్స్ వున్నాయి కనుక తప్పక గమనించాలి. ప్రభుత్వ రంగానికి చెందిన దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC కీలక ప్రకటన చేసింది. నేటి నుండి కూడా ఇవి అమలు లోకి రానున్నాయి.

ఈ నేపథ్యం లో పాలసీదారులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక వీటి కోసం పూర్తిగా చూస్తే… మే 10 అంటే నేటి నుంచి ఎల్‌ఐసీ కార్యాలయాల వర్కింగ్ డేస్ మారబోతున్నాయి. రేపటి నుంచి ఎల్‌ఐసీ ఆఫీస్‌లు వారానికి 5 రోజులు మాత్రమే తెరుచుకుంటాయి. కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎల్‌ఐసీ ఆఫీస్‌లు వర్క్ చేస్తాయి. శని, ఆదివారాల్లో ఆఫీస్‌లు మూసేసి ఉంటాయి.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తాయి. ఈ మార్పులని గమనించి తగిన విధంగా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఇది ఇలా ఉండగా ఎల్‌ఐసీ పాలసీదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే..

మున్సిపల్ కార్పొరేషన్ అందించే డెత్ సర్టిఫికెట్ లేకున్నా కూడా క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తున్నట్టు చెప్పింది. ఇలా కరోనా డెత్ క్లెయిమ్ ప్రాసెస్‌ను సులభతరం చేసింది. మరణించినట్లు ఏదైనా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది అంతే.

 

Read more RELATED
Recommended to you

Latest news