భారీ అంచానాల నడుమ మొదలైన ఇండియన్-2కి కష్టాలు తప్పేలా లేవు. ఇది మొదలైనప్పటి నుంచి అన్నీ అడ్డంకులే వస్తున్నాయి. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2కి పట్టాలు పడ్డాయి.మొదట్లో డైరెక్టర్ శంకర్, లైకా సంస్థ నిర్మాతలకు గొడవ జరగడంతో శంకర్ దీన్ని పక్కన పెట్టేశాడు.
రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో శంకర్ ఇండియన్-2నే చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు నిర్మాతలు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లకు లేఖలు రాశారుతమ సినిమా పూర్తయ్యేవరకు శంకర్ ఎలాంటి సినిమా తీయకుండా చూడాలంటూ కోరారు. దీంతో వివాదం మరింత ముది. రింది. అంటే దీన్ని బట్టి చరణ్ సినిమా మరింత లేట్ ఖావడం ఖాయం.