కోవిడ్ సహాయక చర్యల్లో రిలయన్స్ పౌండేషన్.. ఆంద్రప్రదేశ్ , తెలంగాణకు ఆక్సిజన్ సిలిండర్లు..

-

కరోనాతో దేశమంతా విపత్కర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉండేందుకు చాలా ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. కష్టకాలంలో సేవాదృక్పథాన్ని చూపి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. దేశంలోనే కుబేరుడైన ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న సాయం చెప్పుకోవాల్సిందే. ఇప్పటికే దేశానికంతటికీ 1000మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిలిండర్లని సప్లై చేసింది. ఇది దేశ మొత్తం వినియోగించిన ఆక్సిజన్ సిలిండర్లలో 11శాతం.

తెలుగు రాష్ట్రాలకి కూడా రిలయన్స్ సాయం అందింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలకి 80టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసింది. అదే కాదు అత్యవసర వాహనాలైన అంబులెన్స్ సహా ఇతర వాహనాలకి ఉచితంగా ఇంధనాన్ని అందిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వ అనుమతి ఉన్న అన్ని అంబులెన్సులకి రోజుకి గరిష్టంగా 50లీటర్ల ఇంధనాన్ని అందిస్తుంది. ఈ పద్దతి జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఆక్సిజన్ అవసరం ఉన్న తెలుగు రాష్ట్రాలకి డైరెక్టుగా జామ్ నగర్ నుండి లిక్విడ్ గ్రేడెడ్ ఆక్సిజన్ ని రిలయన్స్ సరఫరా చేసింది.

ఇదే కాదు భారత ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ పోరాటాల్లో రిలయన్స్ పాలు పంచుకుంది. భారతదేశ మొట్టమొదటి కోవిడ్ కేర్ ఆస్పత్రిని కేవలం రెండు వారాల్లోనే నిర్మించింది. ఇంకా 19రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వారందరికీ ఇప్పటి వరకు 5.5కోట్ల భోజనాలను సమకూర్చింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో భారతదేశానికి రిలయన్స్ ఫౌండేషన్ నుండి అందుతున్న సాయం అభినందించదగ్గది.

Read more RELATED
Recommended to you

Latest news