సాధారణంగా శనిదశ అంటేనే అందరికీ భయం. ఇది ఏడేళ్లు ఉంటుందని, అంతకు మించి కూడా ఉంటుందని, శని పట్టిందంటే ఏళ్ల పాటు దాని ప్రభావం ఉంటుందని చాలా భయంగా ఉంటుంది. కానీ, ఈ శని దశ ప్రారంభాన్ని మనం కొన్ని లక్షణాలతో గ్రహించవచ్చంట. అవేంటో తెలుసుకుందాం.
మనం మంచి చేస్తే శనిదేవుడు మనకు మంచే చేస్తాడు. చెడు చేస్తే తప్పకుండా ఆయన మనల్ని శిక్షిస్తాడు.
జోతిషులు చెప్పిన విధంగా నవ గ్రహాల్లో శని దేవుడు న్యాయనిర్ణేత. ఎందుకంటే ఆయనే మంచి, చెడు కర్మఫలాలను మనిషికి ఆయనే అందిస్తాడు. ఈ నేపథ్యంలో శని ప్రభావం ఏయే విషయాల గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఒకవేళ మీకు మాంసం లేదా మద్యం సేవించాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు శని చెడు దృష్టి మీపై బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. మీరు ఈ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంటే శని దుర్మార్గపు ప్రభావాలు మీ నుంచి దూరమవుతాయి. ఇటువంటప్పుడు కేవలం శాఖాహారం తినాలి.
అలాంటి వారికి శని ప్రభావం సోకదు. - మీ అరచేతి రంగు మారితే కూడా శని చెడు ప్రభావం మీపై పడినట్లే. ముఖ్యంగా అరచేతి రంగు క్రమంగా నీలం రంగులో మారి, అక్కడక్కడ నల్ల మచ్చలు ఉంటే శని మీపై ఆగ్రహంగా ఉన్నాడని తెలుసుకోవాలి.
- శని చెడు స్థితిలో ఉంటే వ్యక్తుల నుదురు మసకబారి, ముఖం కళావిహీనంగా తయారవుతుంది. చెంపలు కూడా నల్లగా మారతాయి.
- మీ చెప్పులు లేదా షూ ఎవరైనా దొంగిలిస్తే అది శని ప్రభావమేనని అనుకోవాలి. మీరు శని దేవుడి అనుగ్రహం పొందాలంటే శనివారం నాడు ఎవరికైనా నల్ల రంగు పాద రక్షలు దానంగా ఇవ్వాలి. కానీ, పెదవారికి దానం చేసే వస్తువుల్లో కొత్తవి మాత్రమే ఇవ్వాలి.
- ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఇది శని హానికరమైన ప్రభావం వల్లే జరిగిందని అర్థం. ఇలా జరిగితే మీరు ఏ మాత్రం వాటిని విస్మరంచకూడదు.
- మీ శరీరంలో అకస్మాత్తుగా నొప్పి ప్రారంభమై కీళ్ల నుంచి వెన్ను వరకు నొప్పులు మొదలైతే అది చెడ్డది పరిగణిస్తారు. చెవులు, ఎముకల్లో నొప్పులు ఉంటే శని మీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని అర్థం. సోమరితనం మొదలవుతుంది. మీరు ఏ పనిలోనూ చురుకుగా ఉండలేరు.
- మీ జీవిత భాగస్వామితో కూడా మీ సంబంధం అకస్మాత్తుగా క్షీణిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా చట్టపరమైన విషయాల్లో చిక్కుకోవడం శని చెడు స్థితికి కారణమవుతుంది. మీపై రుణ భారం పెరగడం ప్రారంభమవుతుంది.
- వస్త్రధారణ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అందంగా ఉండాలని, మంచి వస్త్రాలు ధరించాలని అస్సలు అనుకోరు. ఇది కూడా శని ప్రభావమే.
- వ్యక్తులు కూడా మీతో ఉండటానికి ఇష్టపడరు.