నాజల్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..? ఎలా పని చేస్తుంది..?

-

కరోనా వైరస్ చాలా తీవ్రంగా వుంది. దీని కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాక్సినేషన్ ప్రాసెస్ కూడా మరొక పక్క జరుగుతోంది. సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ నాసల్ స్ప్రే గురించి చెప్పారు. ఒకవేళ కనక అది బాగా పని చేస్తే అప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొంచెం సులువు అవుతుంది అని అన్నారు.

నాజల్ వ్యాక్సిన్ అంటే ఏమిటి…?

దీనిని నీడిల్ తో చేతికి కాకుండా ఈ వ్యాక్సిన్ ని ముక్కు ద్వారా ఇస్తారు. ఇది ఇంచుమించు నాజిల్ స్ప్రే లాగ ఉంటుంది. గత సంవత్సరం సైంటిస్టులు ఒక డోస్ ని ముక్కు ద్వారా ఇచ్చారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

కొన్ని రోజుల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఈ వ్యాక్సిన్ ని అందించడానికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు అని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రకారం ఈ వాక్సిన్ వస్తే మరింత ఉపయోగకరమని బాగా పని చేస్తుందని అన్నారు.

అసలు ఇది ఎలా పని చేస్తుంది..?

ఇది ఎలా పని చేస్తుంది అనేది చూస్తే… రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బాగా ఉపయోగ పడుతుంది. ముక్కు ద్వారా ఇది వెళ్లి వైరస్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అక్కడ కనక పోరాడితే వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరితిత్తులుని డామేజ్ చేయదు. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ మీద క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి అని అంది. ఇవి కనుక వస్తే మరింత ఉపయోగకరమని నిపుణులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news