ఛార్మీ సోలోగా బ‌త‌కడానికి కార‌ణం అత‌డేనా..?

-

టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె ఒక‌ప్పుడు మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో అప్పుడప్పుడు ఐట‌మ్ సాంగ్స్ చేస్తూ మెరుస్తోంది. ఇక పూరీతో క‌లిసి సినిమాల‌ను నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఈ హాట్ బ్యూటీ పెండ్లిపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

 

ఛార్మీ

ఆమె అప్ప‌ట్లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అయిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తో ప్రేమ‌లో ఉందని, వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే ల‌వ్ మ్య‌రేజ్ చేసుకుంటార‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ డ్యాషింగ్ డైరెక్టర్ అయి పూరీ జగన్నాథ్ తో ఎక్కువ‌గా సన్నిహితంగా మెల‌గ‌డం చూసి వీరిద్ద‌రూ డీప్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్టు ఇప్ప‌టికీ రోజుకో రూమ‌ర్లు రావ‌డం కామ‌న్ అయిపోయింది.

ఇదిలా ఉండ‌గా ఆమె త‌న బంధువును త్వ‌ర‌లోనే మ్యారేజ్ చేసుకోబోతోంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె తాజాగా స్పందించారు. తాను లైఫ్ లాంగ్ ఒంటరిగా జీవిస్తాన‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో పెండ్లి చేసుకోనంటూ షాక్ ఇచ్చింది. అయితే ఆమె సోలోగా ఉండిపోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డానికి డైరెక్ట‌ర్ పూరీనే కార‌ణ‌మంటూ అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే తాజాగా పూరీ మ్యూజింగ్స్ లో సింగిల్ బై ఛాయిస్ పాడ్ కాస్ట్ విన్న వారంతా పూరీనే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news