పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి…

-

ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ పీసీసీ పదవీ… నియామక చిక్కుముడికి ఇవాళ్టితో తెరపడింది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అయినా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని… మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది అధిష్టానం. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉండి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా గుర్తింపు ఉన్నప్పటికీ ఎన్నికల పోరులో వెనుకబడుతున్న కాంగ్రెస్ ను తిరిగి గాడిన పెట్టగల నాయకుడిగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపింది.

రెండు సంవత్సరాలుగా జరుగుతున్న తర్జనభర్జనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. పీసీసీ గా ఎంపీ రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసిన అధిష్టానం…. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ పేర్లను కూడా ప్రకటించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌‌లను ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news