హా.. గాలి ఫ్రై ఏంది.. అని నోరెళ్లబెట్టకండి. నిజంగా గాలి ఫ్రైనే. గాలిని ఏంచక్కా ఫ్రై చేసి ఇస్తారు. దాన్న కస్టమర్లు లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఓరి దేవుడోయ్.. గాలిని తినడమేందని హాశ్చర్యపోతున్నారా? అయితే.. మిమ్మల్ని ఇటలీలోని క్యాస్టెల్ ఫ్రాంకో వెనెటో నగరానికి పంపించాల్సిందే. అక్కడ ఉన్న ఫెవా రెస్టారెంట్ కు మీరు వెళ్లాల్సిందే. అక్కడే మీకు ఈ గాలి వంటకం దొరికేది.
ముందు అక్కడి ప్రజలు కూడా ఆ రెస్టారెంట్ వాళ్లను నమ్మలేదట. మీరూ మీ గాలి మాటలు ఆపండహె.. గాలితో వంటకం ఏంది.. అది కూడా గాలి ఫ్రై.. అంటూ నవ్వుకున్నారట. కానీ.. తర్వాత ఆ గాలి ఫ్రై టేస్ట్ చూసి ఇప్పుడు అక్కడి జనాలు రెస్టారెంట్ కు క్యూ కడుతున్నారు. దీంతో ఆ వంటకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో… ఆ వంటకానికి 30 డాలర్లు వసూలు చేస్తున్నారట. ముందు ఫ్రీగా పెట్టినా ఎవ్వరూ తినడానికి ముందుకు రాలేదట. తర్వాత దాని టేస్ట్ తెలిశాక.. ఆ వంటకానికి డిమాండ్ పెరగడంతో 30 డాలర్లు పెట్టారు. ఆ రెస్టారెంట్ లో ఈ వంటకం మెనూ కార్డులోనూ చేరింది. ఆ రెస్టారెంట్ కు వెళ్లే కస్టమర్లలో చాలా మంది ఈ గాలి ఫ్రైని తినడానికే వెళ్తున్నారట.
అంతా ఓకే కానీ.. అసలు ఈ గాలి వంటకాన్ని ఎట్లా వండుతారో చెప్పవయ్యా.. అంటారా? అక్కడికే వస్తున్నా. దుంపగడ్డ తెలుసు కదా… అబ్బా అదేనండి కర్రపెండలం. దాని పొట్టుతోనే తయారు చేస్తారు ఈ ఎయిర్ ఫ్రై వంటకాన్ని. దాని పైపొరను మైక్రో ఓవెన్ లో వేడి చేస్తారట. ఆ తర్వాత దాన్ని నూనెలో వేయిస్తారట. అనంతరం దాన్ని దాన్ని ఓ పరికరంలో పెట్టి దాంట్లో ఓజోన్ గాలి నింపుతారు. అంతే.. దీంతో ఆ వంటకం పూర్తవుతుంది. దాన్ని తీసి బూరు మిఠాయి(పీచు మిఠాయి)ని దానికి కలిపి కస్టమర్లకు ఒడ్డిస్తారు. అదే ఫ్రైడ్ ఎయిర్ లేదా ఎరియా ఫ్రిట్టా అని కూడా పిలుస్తారు.