సుప్రీం సీజేఐ సంచలన నిర్ణయం..

-

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ రంజన్ గొగొయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో జస్టిస్‌ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. ఆలోక్‌ వర్మ విషయంలో ఆయనను సెలవుపై పంపడం తగదని కేంద్రాన్ని తప్పుబట్టిన సుప్రీం..తిరిగి విధుల్లో చేరాలని,  తీర్పు వెలువరించిన ధర్మాసనంలో రంజన్‌ గొగొయ్‌ భాగమై ఉన్నారు. సీబీఐ విషయంలో తీవ్ర రాజకీయ దుమారం రేకెత్తడంతో ఆలోక్‌ వ్యవహారంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉంటారు. అయితే మంగళవారం సుప్రీం తీర్పుతో  ఆలోక్‌ విషయంలో ఈ కమిటీ వారం లోగా నిర్ణయం తీసుకోవాలి… దీంతో మోదీ, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, జస్టిస్‌ ఏకే సిక్రీలతో కూడిన కమిటీ ఆలోక్‌పై చర్యల విషయంలో కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్న నేపథ్యంలో గొగొయ్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ అస్థానాల మధ్య వివాదాలు రచ్చకెక్కడంతో కేంద్రం వారిద్దరినీ అక్టోబరులో సెలవుపై పంపింది. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news