జగన్‌ సర్కార్‌ పై ఎన్జీటీ ఆగ్రహం..చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరిక!

-

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు జగన్‌ సర్కార్‌ కు అసలు అచ్చిరానట్లుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ నాయకులు, ఏపీ నాయకుల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. అయితే…ఈ ప్రాజెక్టు విషయంలో జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఊరుకోమని హెచ్చరించింది.

పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటి తీర్పు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ హెచ్చరిక జారీ చేసింది ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని శ్రీనివాస్‌ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది ఎన్జీటీ. ఇక ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై జగన్‌ సర్కార్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news