చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,21, 606 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3,644 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 13,869 గా ఉన్నాయి.
గత 24 గంటల్లో 1417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 96.13 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 95.76 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.57% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,12,982 పరీక్షలు చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 124 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నల్గొండలో 78, సూర్కాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‌లో 51 కేసులు నమోదయ్యాయి.