SBI : ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీనితో కస్టమర్స్ కి మంచిగా బెనిఫిట్స్ కలుగుతాయి. ఎకౌంట్లలో రకాలు కూడా వుంటాయని మనకి తెలుసు. వాటిలో ఒకటి జన్ ధన్ ఎకౌంట్. దీని వలన కస్టమర్స్ కి ఎంతో బెనిఫిట్ గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా/SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా/SBI

స్టేట్ బ్యాంక్ అందించే వాటిలో ఖాతా ఓపెనింగ్ సర్వీసులు కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. స్టేట్ బ్యాంక్‌లో జన్ ధన్ ఖాతా ఓపెన్ చేస్తే..ఎన్నో లాభాలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన అనే స్కీమ్ అందిస్తోంది.

ఈ స్కీమ్ లో భాగంగా మోదీ సర్కార్ పేదలకు కూడా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏమిటి అనేది చూస్తే… ఎకౌంట్ లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు.

కనుక ఏ బ్యాలన్స్ మెయింటైన్ చెయ్యక్కర్లేకుండా ఖాతా నడుస్తుంది. ఈ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. ప్రమాద బీమా కింద రూ.2 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంది.

అలానే రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కలుగుతుంది. బ్యాంక్ నిర్ణయం మీద ఈ సేవలు లభిస్తాయి. ఏ ఇతర బ్యాంకుల్లో అకౌంట్ లేని వారికి ఈ ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది గమనించండి. రూపే డెబిట్ కార్డు పొందిన వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ కింద ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news