24 గంటల్లో 41,806 కేసులు.. 39 కోట్లకి పైగా వ్యాక్సినేషన్…!

-

కరోనా మహమ్మారి వలన ఎంతో ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఈ మహమ్మారి వలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కరోనా మూడవ వేవ్ కూడా తప్పదు అన్న వార్తలు కూడా వింటున్నాం. ఏది ఏమైనా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఆరోగ్యకరమైన సూత్రాలని పాటించడం జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇక గత 24 గంటల్లో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్స్ గురించి చూస్తే..

దేశంలో కరోనా కేసులు ఇంకా వస్తూనే వున్నాయి. 581 మంది కరోనాతో మరణించారు. ఇప్పట వరకూ 4,11,989 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 ,09,87,880 గా వుంది. గత 24 గంటల్లో 41,806 కేసులు నమోదయ్యాయి.

ఇది ఇలా ఉంటే దేశంలో మరో 39,130 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 3,01,43,850 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ఇంకా 432041 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ 39,13,40,491 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది. 34,97,058 మందికి 24 గంటల్లో వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం వంటి కనీస నియమాలని పాటిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news