RRR : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”.. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ!

-

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్… సినిమా కోసం ఆటో మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమా చేయడంతో… భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న విషయం లీకైన.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్  సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ లు రికార్డులను తిరగ రాస్తున్నాయి.

అయితే..తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ROAR OF RRR RRR మేకింగ్ వీడియోను ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేసింది చిత్ర యునిట్. అయితే ఈ వీడియో రీలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి పోస్టర్ ను వదిలాడు. దీంతో కొన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న నందమూరి మరియు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీంతో యాక్టివ్ అయ్యారు. ఈ మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ ఎవరు ఉంటారో తెలియదు కానీ… ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఇవాళ విడుదలయ్యే మేకింగ్ వీడియోలు తమ హీరోకే బాగా హైప్ వస్తుందని… అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు. మా హీరోనే గొప్ప… అంటూ సెటైర్లు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. ఇక గతంలోనూ ఎన్టీఆర్ మరియు రాంచరణ్ టీజర్లు వచ్చినప్పుడు ఇలాగే హంగామా చేశారు ఫాన్స్. కాగా ఎన్టీఆర్, చ‌రణ్ ప్రధాన పాత్రల‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news