టెక్సాస్ లో నమోదైన మొదట మంకీ పాక్స్ కేసు..!

-

చాలా అరుదుగా వచ్చే మంకీ పాక్స్ (monkey pox) కేసు టెక్సాస్ లో నమోదయింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శుక్రవారం నాడు ఈ విషయాన్ని తెలిపారు. ఇదే మొట్టమొదటి కేసు. US లో ఒకతనికి ఈ సమస్య వచ్చినట్లు గుర్తించారు.

అతను ఈ మధ్యన నైజీరియా నుండి యునైటెడ్ స్టేట్స్ కి ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు డల్లాస్ లో ఉన్నారు. అయితే ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి అని డల్లాస్ కంట్రీ జడ్జ్ Clay Jenkins అన్నారు.

కేవలం నైజీరియాలో మాత్రమే కాకుండా 1970 నుండి పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఇది ఉన్నట్లు గుర్తించారు. 2003లో యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా కేసులు నమోదైనట్లు సిడిసి అంది. స్మాల్ పాక్స్ కి చెందినదే ఈ మంకీ పాక్స్ అని నిపుణులు అంటున్నారు.

మొదట ఫ్లూ తో మొదలయ్యి ఆ తర్వాత వాపు కలగడం ముఖంపై విస్తృతమైన దద్దుర్లు వంటివి రావడం జరుగుతుంది. డ్రాప్లెట్స్ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఇది సోకే అవకాశం ఉంది అయితే కరోనా కారణంగా మాస్కులు ధరిస్తున్నారు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి డ్రాప్లెట్స్ ద్వారా చేరదని.. దీనితో ఈ ప్రమాదం తగ్గుతుందని అన్నారు.

ఇప్పుడు నమోదైన కేసు చూస్తే.. ఇన్ఫెక్ట్ అయిన ఆ వ్యక్తి లో ఉండే వ్యాధి వెస్ట్ ఆఫ్రికా నైజీరియా లో ఇన్ఫెక్ట్ అయిన స్ట్రైన్ నుండి అని తెలుస్తోంది. నైజీరియా నుండి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు మంకీ బాక్స్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news