యుద్ధభూమిలోకి వచ్చే జర్నలిస్టులు ముందే సమాచారం ఇవ్వాలి.. దానిష్ మృతిపై తాలిబన్.

-

ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో భారతదేశానికి చెందిన జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ మృతి చెందారు. ఆఫ్ఘన్ బలగాలకు, తాలిబన్లకు జరిగిన యుద్ధంలో దానిష్ సిద్ధిఖీ కన్నుమూసారు. ఈ విషయమై తాలిబన్ నాయకుడు, జైబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, ఇరువురి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరి వల్ల దానిష్ ప్రాణం పోయిందో తెలియదు. ఈ విషయంలో మేం క్షమాపణలు కోరుతున్నాం అని సీఎన్ఎన్ కి ఇచ్చిన సమాచారంలో మాట్లాడారు.

ఇంకా ఈ విషయమై మాట్లాడిన ముజాహిద్, జర్నలిస్టులు యుద్దభూమిలోకి ప్రవేశించలనుకుంటే మాకు సమాచారం అందించాలని, దానివల్ల మేము కేర్ తీసుకుంటామని, దానిష్ సిద్ధిఖీ మృతిపట్ల మేము చింతిస్తున్నామని అన్నారు. రాయిటర్స్ కి చెందిన దానిష్ సిద్ధిఖీ, ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు గెలుచుకున్నాడు. 38సంవత్సరాల వయసులో ఆఫ్ఘన్, తాలిబన్ల జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news