యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా “తిమ్మరుసు” ట్రైలర్

-

హీరో సత్యదేవ్ ఈ పేరు తెలియని వారుండరు. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. తాజాగా మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలెంటెడ్ యాక్టర్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా లాయర్‌ గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు యువ హీరో.

ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అటు ఇప్పటికే.. ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తిమ్మరుసు ట్రైలర్ ను… జూలై 26న అంటే రేపు సాయంత్రం 4:50 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో ట్రైలర్ విడుదలపై అటు చిత్ర బృందంతో పాటు… సత్యదేవ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా ఈ సినిమా మా జూలై 30న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news