ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు,రేపు మరియు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాయలసీమ లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.