సచివాలయం వద్ద సర్పంచ్‌ల జేఏసీ ఆందోళన ఉద్రిక్తత..

-

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం గేటు ఎదుట అమరవీరుల స్మారకం ముందు రాష్ట్ర సర్పంచ్‌ల జేఏసీ ఆందోళన చేపట్టింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ సర్పంచ్‌ల జేఏసీ సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

దీంతో పోలీసులకు, సర్పంచ్‌లకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సర్పంచ్‌లను, జేఏసీ నాయకులను పోలీసులు బలంతంగా అదుపులోకి తీసుకున్నారు.12,769 గ్రామ పంచాయతీలలో రూ.1,500కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వాటి విడుదలకు నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈనెల 30వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని లేనియెడల నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news