ప్రాజెక్టులు నిండినా రైతులకు నీళ్లు ఇవ్వరా? : హరీశ్ రావు ఫైర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ ఫైర్ అయ్యారు. ఇటీవల వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండినా రైతులకు సాగుకోసం నీరు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన కామెంట్స్ చేశారు.

సోమవారం ఆయన తెలంగాణ భవన్‌‌లో మాట్లాడుతూ..పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉన్నా రైతులకు పూర్తిగా సాగునీరు అందకపోవడం దారుణమన్నారు. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఇలాంటి దుస్థితి రావడం నిజంగా దురదృష్టకరమన్నారు.జిల్లాకు వచ్చే సాగర్ కాలువకు గండి పడి 22 రోజులు గడిచినా..ఇప్పటివరకు దానిని పూడ్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణం అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news