చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.కాగా, ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా పోక్సో యాక్ట్ కింద నేరమేనని సంచలన తీర్పు చెప్పింది. తీర్పు ఇవ్వడంలో హైకోర్టు ఘోర తప్పిదం చేసిందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
అదేవిధంగా, కేంద్రానికి పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’అనే పదంపై నిషేధం విధించింది.‘ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్’(CSEAM) అనే పదంతో మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని పార్లమెంట్‌కు సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది.ఇకపై కోర్టులు ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని వాడొద్దని ఆదేశించింది.