అయేషా హత్య కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు…

-

కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మర దర్యాప్తుని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. అయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ ని  అధికారులు శుక్రవారం దాదాపు 14 గంటల పాటు విచారించింది. వీడియో రికార్డింగ్ పద్ధతిలో సీబీఐ అధికారులు సతీష్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.  అయేషా హత్య కేసులో శిక్షకు గురై ఇప్పటికే జైలు జీవితం అనుభవించి హైకోర్టు తీర్పుతో విడుదలైన సత్యంబాబును కూడా అధికారులు ప్రశ్నించారు.

అయితే కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కేసులో పోలీసులు ఇరికించి  తనను చిత్రహింసలకు గురిచేసి విలువైన వయసుని కోల్పోయనని.. సీబీఐ అధికారులకు సత్యంబాబు తెలిపాడు. సీబీఐ విచారణలో మరో సారి అయేషా మీరా హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news