ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్‌ ఇవే!

-

బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిపేవారికి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. దాదాపు ఈ రూల్స్‌ సామాన్యులను ప్రభావితం చేసేవే. ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతీ నెల ఒకటో తేదీన జీతం అకౌంట్‌లో పడేవారికి ఓ సమస్య ఉండేది. అదే ఒక్కోసారి ఒకటో తేదీ ఆదివారం వస్తే శాలరీ ఆలస్యం అవుతుంది. కానీ ఇకపై ఇలాంటి సమస్యే ఉండదు.

 

  • సెలవు రోజుల్లో కూడా కస్టమర్లకు అకౌంట్లలో వేతనాలు జమ చేసేలే నేషనల్‌ ఆటోమెటెడ్‌ క్లియరెన్స్‌ హౌజ్‌ మార్పులు చేసింది. వేతనాలు, పెన్షన్లు, డివిడెండ్, వడ్డీ క్రెడిట్‌ అవుతాయి. అంతేకాదు… మీరు చెల్లించాల్సిన ఈఎంఐ, మ్యూచువల్‌ ఫండ్‌ సిప్, లోన్‌ పేమెంట్‌ లాంటి వాటికీ ఈ రూల్‌ వర్తిస్తుంది.
  • ప్రస్తుతం ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌కు రూ.15, నాన్‌ ఫైనన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌
    కు రూ.5. అయితే, ఆగస్ట్‌ 1 నుంచి ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.17 చెల్లించాలి. నాన్‌ ఫైనన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌
    కు రూ.6.
  • 15సీఏ, 15సీబీ ఫామ్స్‌ ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్‌ 15 కి పొడిగించింది.
  • ఆయిల్‌ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. అంటే పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆగస్టులో కూడా కొనసాగుతుందా? తగ్గుతుందా అన్న విషయం ఆగస్ట్‌ 1న తెలుస్తుంది.
  • ఐపీపీబీ 2021 ఆగస్ట్‌ 1 నుంచి డోర్‌స్టెప్‌ సేవలకు రూ.20+జీఎస్‌టీ వసూలు చేయనుంది. ఇప్పటివరకైతే ఐపీపీబీ డోర్‌స్టెప్‌ సేవలకు ఛార్జీలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news