ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 10 లక్షల వరకు రుణాన్ని ఎంతో ఈజీగా పొందొచ్చు..!

ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయా..? ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మీకోసం ఒక అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో వుంది. దీనితో మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

డబ్బులు
డబ్బులు

అర్హత కలిగిన వారికి నిమిషాల్లోనే రుణం లభిస్తోంది. అది ఎలా అంటే..? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అర్హత కలిగిన వారికి సులభంగానే లోన్స్ ఇస్తోంది. ఇలా ఎవరైనా ఈజీగా లోన్ తీసుకోవచ్చు. దానితో బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

దీని కోసం బ్యాంక్ డిజిటల్ లెండింగ్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ లోన్‌ ట్యాప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రుణ గ్రహీతలు కొన్ని నిమిషాల్లోనే రుణం తీసుకునే అవకాశం వుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో కస్టమర్స్ ఈజీగా లోన్ తీసుకోవచ్చు. కొన్ని నిమిషాల్లోనే క్రెడిట్ లిమిట్ ని కూడా పొందొచ్చు. అయితే ఈ లోన్ ట్యాప్‌కు 32 వేల మంది కస్టమర్లు ఉన్నారు. తాజా ఒప్పందంతో లోన్ ట్యాప్ కస్టమర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

దీనిలో రుణ గ్రహీతలు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ని 48 నెలలలోగా తిరిగి పే చెయ్యాల్సి ఉంటుంది. లోన్ ట్యాప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. దీనితో ఆర్ధిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి.