దళిత బంధు పథకం : 500 కోట్లు విడుదల

-

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ దళిత బంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దళిత బంధు పథకం కోసం ఏకంగా ఐదు వందల కోట్లు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా ఐదు వందల కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు బిఆర్ఓ ( బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ) ఇచ్చారు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు.

cm-kcr
cm-kcr

పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ లో అమలు చేసేందుకు ఫండ్స్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.దళిత బంధు పథకం కోసం.. ఒక హుజురాబాద్ నియోజక వర్గానికే ఏకంగా రెండు వేల కోట్లను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇక్కడే మకాం వేసి, పదునైన వ్యూహాలతో ముందు కెళుతున్నారు. తమ ప్రత్యర్ధులని చిత్తు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరుపున ఈటల రాజేందర్ ప్రచారం మొదలు పెటగా.. అటు అధికార పార్టీ.. కూడా మంత్రులతో ప్రచారం కొనసాగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news