గంగులకు షాక్.. కరీంనగర్‌లో 9 గ్రానైట్‌ క్వారీలకు ఈడీ నోటీసులు !

-

కరీంనగర్‌లో 9 గ్రానైట్‌ పరిశ్రమలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు బండి సంజయ్‌. కరీంనగర్‌ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్‌ ఎగుమతి చేసినట్లు ఫిర్యాదు చేశారు బండి సంజయ్.

విదేశాలకు ఎంత గ్రానైట్‌ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. గత నెలలో చెన్నై ఎలైట్‌ షిప్పింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా కరీంనగర్‌లో 9 గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. కరంనగర్‌లోని శ్వేత ఏజెన్సీ, ఎ.ఎస్‌.షిప్పింగ్‌, జేఎం బ్యాక్సీ, మైథిలి ఆధిత్యట్రాన్స్‌ పోర్ట్‌, కేవీఎ ఎనర్జీ, అరవింద్‌ గ్రానైట్‌, శాండియా ఏజెన్సీస్‌, పి.ఎస్‌.ఆర్‌ ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌ అండ్‌ లాజిస్టిక్‌లు ఎంత మేరకు గ్రానైట్‌ ఎగుమతి చేశారో వివరాలు ఇవ్వాలని పేర్కొంది ఈడీ.

Read more RELATED
Recommended to you

Latest news