ఆ క్షణం మరిచిపోలేనిది : నీరజ్ చోప్రా ఏమోషనల్ ట్వీట్

-

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు జావెలిన్ త్రో లో నీరజ చోప్రా శనివారం పసిడి పతకాన్ని అందించాడు. నిన్న జరిగిన జావెలిన్ బ్రో లో రికార్డు స్థాయిలో 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా కలలుకంటున్న బంగారు పతకాన్ని నిజం చేసి చూపించాడు నీరజ్ చోప్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం గెలుపొందగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్ కు లభించిన పసిడి పతకం ఇదే కావడం విశేషం.

అలాగే కే.ఏ మొత్తం ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గత వంద సంవత్సరాలలో భారత్ కు లభించిన ఏకైక పథకం ఇదే కావడం గమనార్హం. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీరా చోప్రా కు స్వయంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హర్యానా ప్రభుత్వం, బీసీసీఐ మరియు ఇతర ప్రముఖ సంస్థలు నీరజ్ చోప్రాకు నజరానాలు ప్రకటిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా తన గెలుపు పై స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. గోల్డ్ మెడల్ సాధించిన క్షణం తనకు ఇంకా గుర్తు ఉందని… ఆ క్షణాన్ని తన జీవితంలో మరిచిపోలేనని తెలిపాడు. తన విజయం కోసం సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. “ఇప్పటికీ ఈ అనుభూతిని మైండ్ లో ఉంది. భారతదేశానికి మరియు అంతకు మించి, ఈ దశకు చేరుకోవడానికి నాకు సహాయపడిన మీ మద్దతు మరియు ఆశీర్వాదాలకు చాలా ధన్యవాదాలు.ఈ క్షణం నాతో శాశ్వతంగా జీవిస్తుంది” అంటూ పేర్కొన్నాడు నీరజ్.

Read more RELATED
Recommended to you

Latest news