తాడేపల్లి :మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష అని.. ఎత్తిపరిస్తుల్లోనూ మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయని.. కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కలిగిస్తోందని.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారన్నది స్పష్టం అయ్యింది కదా ? చురకలు అంటించారు. ట్వీట్ లు పెట్టేటప్పుడు సమాచారం చెక్ చేసుకుని పెట్టడం లోకేష్ తెలుసు కోవాలని మండిపడ్డారు. తన సొంత సంపదకు విఘాతం కలుగుతుందనే చంద్రబాబు ఆవేదన చెందుతున్నాడని.. టీడీపీ నేతల సంపద సృష్టి కలలు చెల్లాచెదురవుతున్నాయని అచ్చెన్నాయుడు ఆవేదన చెందుతున్నాడని ఫైర్ అయ్యారు. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని అచ్చెన్నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారు?అని నిప్పులు చెరిగారు. అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అధ్యక్షుడా లేక అమరావతి టీడీపీకి అధ్యక్షుడా? ప్రశ్నించారు.