ప్రజాప్రతినిధుల కేసు : కేంద్రంపై ఎన్.వి.రమణ సీరియస్

-

సుప్రీంకోర్టు లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులు న్యాయస్థానలలో సత్వర విచారణపై విచారణ జరిపింది చీఫ్ జస్టీస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అసహనం వ్యక్తం చేశారు. విచారణ ఆగస్టు 25 కి వాయిదా వేసిన చీఫ్ జస్టిస్…కేసులపై ఆ లోపు నివేదికలు ఇవ్వాలని కేంద్రంకు ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సత్వర న్యాయ విచారణ కోసం ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుపుతున్న స్పెషల్ కోర్టులు,సిబిఐ కోర్టుల జడ్జీలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించాలని పేర్కొంది సుప్రీంకోర్టు. అలాగే రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల లోపు వారి నేర చరిత్రను పబ్లిష్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news