గాదరి కిషోర్ కు బెదిరింపులు… ఆడియో వైరల్

-

బిఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మొన్న నల్గొండ సభలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు… గాదరి కిషోర్ కౌంటర్ ఇచ్చారు. బిజెపి పార్టీ ఆడుతున్న నాటకంలో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై ప్రశ్నించగా కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం దారుణమన్నారు. కెసిఆర్ తిట్టి హీరో కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పై… ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం ఈ ఆడియో ఫోన్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఫోన్ చేసి… తాను స్వేరో సంపత్ గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి… ప్రవీణ్ కుమార్ అసలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తిట్టే స్థాయి… లేదంటూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు వార్నింగ్ ఇచ్చారు స్వేరో సంపత్. మరోసారి ఇ ఆర్ఎస్ ప్రవీణ్ పై విమర్శలు చేస్తే చూస్తూ… హెచ్చరించారు స్వేరో సంపత్. అయితే ఆ వ్యక్తి బెదిరింపులకు లొంగని ఎమ్మెల్యే గాదరి కిషోర్… అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను బెదిరిస్తే వేరే వ్యక్తిని కాదని… తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు అని పేర్కొన్నారు. గాదరి కిషోర్ అంటే మామూలు వ్యక్తి కాదని… 172 కేసులు పెట్టుకుని తిరుగుతున్నాను అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెదిరించడం అంటే బెదిరిస్తున్నావా? అలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. మరోసారి ఇలా బెదిరింపులకు దిగితే… పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news