ఎస్‌బీఐ 2021 నోటిఫికేషన్‌.. అర్హత, చివరితేదీ!

-

బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. దిగ్గజ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో కొత్త నోటిఫికేషన్‌ ( ఎస్‌బీఐ 2021 నోటిఫికేషన్‌ | SBI 2021 Notification‌ )ను విడుదల చేసింది. స్పేషలిస్ట్‌ (సివిట్‌/ ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి ఉన్నవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆగస్టు 13 నుంచి మొదలైంది. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 2. నోటిఫికేషన్‌ ఇతర వివరాలు తెలుసుకుందాం.
ఈ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా ఎస్‌బీఐ 46 పోస్టులను భర్తీ చేయనుంది. అందులో 36 పోస్టులు అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌), మిగతా పది పోస్టులు అసిస్టెంట్‌ మేనేజర్‌ – ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)పోస్టులు.

sbi | ఎస్‌బీఐ
sbi | ఎస్‌బీఐ

జీతభత్యాలు…

ఇందులో అర్హత సాధించినవారికి ఎస్‌బీఐ అందించే నెలవారీ జీతభత్యాలు ఇలా ఉన్నాయి. రూ.36,000–1490/7–46340–1740/2–49910–1990/7–63840. ఇంకా అధికారులు ఇతర డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్, కంట్రిబ్యుటరీ పెన్షన్‌ ఫండ్, ఎల్‌ఎఫ్‌సీ, మెడికల్‌ ఫెసిలిటీ ఇతర వెసులుబాటులు కూడా ఉండనున్నాయి.

అర్హత…

అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇంజినీర్‌ (సివిల్‌) విభాగానికి దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసి, 60 శాతం, దానికంటే ఎక్కువ సాధించినవారు అర్హులు.
అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇంజినీర్‌( ఎలక్ట్రికల్‌)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీతోపాటు 60 శాతం అంతకంటే ఎక్కువ సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల సంబం«ధిత వివరాల కోసం ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం..

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో పాస్‌ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

ఆన్‌లైన్‌ టెస్ట్‌..

రాత పరీక్ష 2021 సెప్టెంబర్‌ 25 నుంచి నిర్వహించనున్నారు. కాల్‌లెటర్స్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్లో పెట్టనున్నారు. అభ్యర్థులు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్‌ను కూడా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. పరీక్ష దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు.

అధికారిక వెబ్‌సైట్‌: sbi.co.in

Read more RELATED
Recommended to you

Latest news