సీనియర్ హీరోయిన్ భానుప్రియ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలికపై దాడి చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి తల్లి ప్రభావతి తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తన కూతురిని భానుప్రియ ఇంట్లో పనిలో పెట్టామని సంవత్సరం నుండి కనీసం కూతురుతో మాట్లాడేందుకు కూడా వీలు కలిగించడం లేదని బాధితురాలి తల్లి ప్రభావతి ఫిర్యాదులో పేర్కొంది.
కూతురిని ఇంటికి తీసుకెళ్లేందుకు వారు అంగీకరించడం లేదని.. గట్టిగా మాట్లాడితో ఇంట్లో చోరి కేసు పెడతాం అన్నట్టుగా మీడియా ముందు చెప్పారు ప్రభావతి. అయితే భానుప్రియపై వచ్చిన ఫిర్యాధుని పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే యాక్షన్ లోకి దిగనున్నారు. ప్రభావతి ఫిర్యాదులో భానుప్రియ సోదరుడు ఆ బాలికను లైంగికంగా వేధించాడని కూడా రాసిందట. అయితే విచారణ అనంతరం వాటిని వెళ్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. పిల్లలతో పనిచేయించడమే నేరం కాగా ఇలాంటి పనులు చేయిస్తున్న భానుప్రియ అది నిజమే తెలిస్తే చిక్కుల్లో పడక తప్పదు.