మళ్లీ రంగంలోకి హైడ్రా..60 వరకు నోటీసులు..15 రోజుల సమయం !

-

మళ్లీ రంగంలోకి హైడ్రా దిగుతోంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తోంది హైడ్రా. కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను డిమాలిష్ చేయనుంది హైడ్రా.

పూర్తిగా కబ్జా అయిన కొన్ని చెరువులకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటున్న హైడ్రా…. చెరువుల్లోకి వచ్చే వ్యర్ధాలను ఆపడానికి పిసిబి తో కలిసి పని చేయనుంది. చెరువుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చే వారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో MOU చేసుకోనుంది హైడ్రా.

కాగా…హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది హైడ్రా. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది.. అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ చేయనుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే.. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది హైడ్రా.

Read more RELATED
Recommended to you

Latest news