రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన IRCTC…!

-

ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ వుంటారా..? అయితే మీరు వీటిని కచ్చితంగా తెలుసుకోవాలి. తాజాగా ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్స్‌కు ఝలక్ ఇచ్చింది. ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్‌ను సవరించింది. దీనితో వాటిపై కాస్త ప్రభావం పడచ్చని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇక నుండి సీనియర్ సిటిజన్స్ రైల్లో ట్రావెల్ చెయ్యాలని అనుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ కావాలనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోచ్చు.

Indian-Railways
Indian-Railways/ఇండియన్ రైల్వేస్

ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ పైన ఉన్న బెర్తుల్లో సౌకర్యవంతంగా ఉండదు కనుక లోయర్ బెర్త్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఇలా ఉంటే టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ ఆప్షన్ ని ఎంచుకున్న.. లోయర్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుందని చెప్పడానికి ఇక వీలుండదు. మీరు ప్రయాణం చేసే తోటి ప్యాసింజర్ల ప్రాతిపదికన మీకు సీటు లభ్యత ఆధారపడి ఉంటుంది అని IRCTC తెలిపింది.

60 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన మగ వారు, 45 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన మహిళలు ఈ కోటా కింద లోయర్ బెర్త్ పొందే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని షరతులు కూడా వున్నాయి అని అంది. సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా లేదా ఒకే టికెట్‌ పై ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే.. వారికి లోయర్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా లేదంటే ఒక సీనియర్ సిటిజన్ ఇతర ప్రయాణికులు సీనియర్ సిటిజన్స్ కాకపోయినా లోయర్ బర్త్ రాడుట.

Read more RELATED
Recommended to you

Latest news