కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన

-

అమృత్ పథకం టెండర్లలో రూ. 8,888 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం వెంటనే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కి టెండర్లు దక్కాయని.. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. 

సచివాలయంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. అలాగే కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అమృత్ పథకం టెండర్లలో రూ. 8,888 కోట్లకు ఎవరు దక్కించుకున్నారో చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు మంత్రి పొంగులేటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే టెండర్లను రూ.3,616 కోట్లకు మూడు ఫ్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించిందని ప్రకటించారు. గత ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు బీఆర్ఎస్ ఈ టెండర్లను కట్టబెట్టిందని పేర్కొన్నారు పొంగులేటి. 

Read more RELATED
Recommended to you

Latest news