తిరుమల లడ్డు వివాదం.. రోజాకు భార్గవి కళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్..!

-

తిరుమల లడ్డూ వివాదం పై తెలంగాణ బీజేవైఎం నాయకురాలు భార్గవి కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో తిరుమలలో ఫొటో సూట్ చేసిన రోజా ఇప్పుడు ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. లడ్డూ వివాదం పై రోజా ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ఆరోపించారు. దేవుడి ప్రసాదం రోజా తినలేదా..? అని నిలదీశారు.

పవిత్రమైన తిరుమల ప్రసాదంలో బీఫ్, ఫిష్ ఆయిల్ కలుపుతారా..? అని మండిపడ్డారు. పశువులకైనా ఇంగితం ఉంటుందని.. వైసీపీ వాళ్లకు అది లేదని విమర్శించారు. హిందూ కల్చర్ నాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ధ్వజమెత్తారు. తిరుమల లాంటి పవిత్ర స్థలాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు భార్గవి కళ్యాణి. సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి చాలా ఎత్తుగడలు వేస్తున్నారని.. హిందువునే టీటీడీ చైర్మన్ గా చేసి తిరుమలలో నికృష్టపు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తే.. కొట్టండి అంటూ ఆవేశ పూరిత వ్యాఖ్యలు చేశారు భార్గవి కళ్యాణి. 

 

Read more RELATED
Recommended to you

Latest news