మేషరాశి: అనుకూల వాతావరణం, దేవాలయ దర్శన సూచన, స్త్రీల వల్ల లాభం, విందులు, వినోదాలు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.
వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, ప్రయాణాలలో ఇబ్బందులు, ధనవ్యయం. పరిహారాలు మాసశివరాత్రి అభిషేకం చేసుకోండి లేదా ఈశ్వర ఆరాధన చేయండి.
మిధునరాశి: మిశ్రమ ఫలితాలు, విందులు, వ్యసనాల వల్ల ధన నష్టం. వివాదాలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళ శివాభిషేకం చేయించుకోండి. లేదా జరిగే దేవాలయాలకు వెళ్లి పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది.
కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, సంతానంతో ఇబ్బందులు, చికాకులు. పరిహారాలు శివాభిషేకం లేదా శివునికి మారేడు దళాలతో అర్చించండి.
సింహరాశి: అనుకూలమైన రోజు, వస్తులాభం, దైవకార్య సూచన, విందులు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు.
కన్యారాశి: అనుకూలమైన రోజు, ఉత్సాహంగా ఉంటారు, ఆదాయ వృద్ధి. వీలైతే శివాలయ దర్శనం, అభిషేకం చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది.
తులారాశి: ధనలాభం, స్త్రీ సౌఖ్యం, విందులు, అనుకోని అవమానాలు. పరిహారాలు గోసేవ లేదా చాలీసా పఠనం చేయండి.
వృశ్చికరాశి: అనుకూలమైన రోజు, అన్నింటా జయం, దేవాలయ దర్శన సూచన. పరిహారాలు ఇష్టదేవతారాధన చేయండి.
ధనస్సురాశి: అనుకూలమైన రోజు, వస్తులాభం, ఆరోగ్యం, మిత్రులతో స్వల్ప విబేధాలు. పరిహారాలు ఈశ్వరునికి అభిషేకం లేదా పూజ చేసుకోండి.
మకరరాశి: అనుకూల ఫలితాలు, కార్యజయం, సోదరీ రాక, రుణాలు తీరుస్తారు. పరిహారాలు మాసశివరాత్రి అభిషేకం లేదా ఇష్టదేవతారాధన చేసుకోండి.
కుంభరాశి: పనులు పూర్తి, కార్యజయం, దేవాలయ దర్శనం, పూజలు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేయండి.
మీనరాశి: మంచి రోజు, అనుకూల వాతావరణం, వ్యాపారులకు అధిక లాభం, ప్రయాణ సూచన. పరిహారాలు శివపూజ లేదా విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం.
నోట్: దానం చేయండి అంటే వేలు, లక్షలు కాదు. భక్తితో మీ శక్తి సామర్థ్యం మేరకు ఐదు రూపాయల నుంచి మీకు ఇబ్బంది లేనంత వరకు. ఉదాహరణకు మీ ఇంట్లోనే అన్నం, పప్పు/కూర లేదా ఏదో ఒక తినే పదార్థం శుభ్రం/శుచితో వండి రోడ్డు పక్కన ఉండే నిస్సాహాయకులకు పార్సిల్ అందించండి. లేదా జీహెచ్‌ఎంసీ ఐదురూపాయల భోజనం దగ్గర పదో పరకో ఇచ్చి కొంత మందికి భోజనం పెట్టమనండి. చేసిన దానధర్మాలు పక్కవారికి చెప్పాల్సిన అవసరం లేదు.
మీకు మంచి జరిగిన తర్వాత ఆ ఫలితాన్ని చేసిన దాన్ని వారిని ప్రేరేపించి సన్మార్గంలో నడపడానికి విషయ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే చెప్పండి. దానం చేయంగానే సెల్ఫీ దిగి ప్రచారం చేసుకోకండి. అసలు ఫలితం ఉండదు. ఏది చేయలేకుంటే మనస్సులో కనీసం నాకు ఇంత ఉంటే ఇది చేసేవాడిని అని అనుకుని భగవంతునికి నమస్కారం చేసుకోండి. కలియుగ ధర్మం ప్రకారం మీ ఖాతాలో పుణ్యం వస్తుంది.
-కేశవ