బిగ్ బాస్ నెక్స్ట్ క్యాప్టెన్ అతడే..ఇదిగో ప్రూఫ్..!

-

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2 వ‌ర‌కూ అంతా బాగానే ఉంది కానీ సీజ‌న్ 3 నుండి లీకులు మొద‌ల‌య్యాయి. ఎవ‌రు క్యాప్టెన్ అయ్యారు. ఎవ‌రు నామినేష‌న్ లో ఉన్నారు. ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నారు అన్నీ మందుగానే తెలిసిపోతుంది. లీకు రాయుళ్లు ప్ర‌తీ అప్డేట్ ను ముందే లీక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ లో బిగ్ బాసే లీకు రాయుడుగా మారిపోయాడు. గ‌త వారం ఇంటి కెప్టెన్ గా విశ్వ ఎంపిక‌వ్వ‌గా ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వ‌క‌ముందే ప్రోమోలో విశ్వ‌కు కెప్టెన్ బ్యాడ్జ్ క‌నిపించింది. ఇక ఈ వారం కూడా అదే రిపీట్ అయ్యింది.

ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా జ‌శ్వంత్ జెస్సీ ఎన్నికైన‌ట్టు ఈ రోజు ప్రోమోలో క‌నిపించింది. దాంతో బిగ్ బాసే లీకు రాయుడిగా మారిపోయాడంటూ బిగ్ బాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా విడుద‌లైన బిగ్ బాస్ ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ప్రోమోలో ఇంటి సభ్యులంతా త‌మ ఫ‌స్ట్ ల‌వ్ గురించి చెబుతూ ఎమోష‌న‌ల్ అవుతున్నారు. దాంతో ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news