జగన్ హవాలో ఏపీలో తెలుగుదేశం పార్టీ కంచుకోటలు గల్లంతు అయిపోయాయి. ఇప్పటికే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు సైకిల్ చిత్తు అయింది. చాలా కంచుకోటల్లో టిడిపి జెండా డౌన్ అయింది. కాకపోతే జగన్ గాలిని తట్టుకుని 23 సీట్లలో టిడిపి ఎలాగోలా గెలిచింది. కానీ పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలోచ్చేసరికి టిడిపి కంచుకోటల్లో వైసీపీ హవా స్పష్టంగా కొనసాగింది.
ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే…కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు టిడిపికి ఎలాంటి కంచుకోటలో అందరికీ తెలుసు. ఈ రెండిటిలో టిడిపి ఇంతవరకు ఓడిపోలేదు. అలాంటిది కుప్పంలో పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడింది. కుప్పంలో మొత్తం 66 ఎంపిటిసిలు ఉంటే టిడిపి గెలిచింది 3 మాత్రమే. ఒక జెడ్‌పిటిసి స్థానం కూడా గెలుచుకోలేదు. అంటే టిడిపి పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. అందుకే కొడాలి నాని సైతం….నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడారు. అలా అంటే అక్కడ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా వైసీపీ హవా కొనసాగుతుంది. పంచాయితీల్లో వైసీపీ ఆధిక్యం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇటు ఒక్క జెడ్‌పిటిసి స్థానం గెలుచుకోలేదు. ఇక 43 ఎంపిటిసి స్థానాల్లో టిడిపి గెలిచింది 7 మాత్రమే. అంటే హిందూపురంలో కూడా జై బాలయ్య అనేవారు బై బై బాలయ్య అంటున్నట్లు కనిపిస్తోంది.
పైగా బాలయ్య, నేతలకు ఫోన్లు చేసి ఇంకా దుమ్ముదులిపేద్దాం, రోడ్ల మీదకు వచ్చేద్దాం అంటూ హడావిడి చేస్తారు తప్ప, నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అండగా మాత్రం నిలబడలేకపోతున్నారు. అందుకే అక్కడ టిడిపికి ఘోరమైన ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ నేత ఇక్బాల్ సైతం బాలయ్యకు దమ్ముతుంటే రాజీనామా చేసి తనతో తలపడాలని, ఓడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తున్నారు. మరి బావాబామ్మర్దుల పరిస్తితి ఏంటో ఇలా అయిపోయింది.