ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగావకాశాలని కల్పిస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. నోయిడా, చెన్నై లొకేషన్లలో కామర్స్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం వున్నా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
మేనేజ్‌మెంట్ లెవల్ అనలిస్ట్ (నోయిడా లొకేషన్) కి అయితే కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలానే సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇది ఇలా ఉంటే తమ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో చెల్లింపుల నిర్వహణ కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. మేనేజ్‌మెంట్ అనలిస్ట్‌గా సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సి ఉంటుంది. అలానే మీ క్లయింట్లు లేదా యాక్సెంచర్ మేనేజ్మెంట్లోని ఫైనాన్షియల్ టీమ్‌తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి. కంపెనీ యాక్టివిటీస్‌పై, కొత్త అసైన్‌మెంట్లపై వివరణాత్మక సూచనలు ఇవ్వడం, కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
ఇక మేనేజ్‌మెంట్ లెవల్ అసోసియేట్– చెన్నై కి అయితే ఏదైనా కామర్స్ సబ్జెక్ట్‌లో బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. పే ప్రాసెసింగ్,- అకౌంట్స్ ప్రాసెసింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి. www.accenture.com/us-en/careers ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.