ఇండియన్ నేవీలో ఇంటర్ పాస్ అయినవారు ఇలా బీటెక్ చెయ్యచ్చు..!

-

మీరు ఇంటర్ పాస్ అయ్యారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. పెళ్లి కాని యువకులు మాత్రమే ఈ నోటిఫికేషన్‌ కి దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారు కేరళ లోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. 2022 జనవరిలో బీటెక్ డిగ్రీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. దీనిలో మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ నేవీ.

 

jobs in navy

కనుక ఆసక్తి, అర్హత వున్న వాళ్లు దీని కోసం అప్లై చేయచ్చు. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌ లో ఈ ఖాళీలున్నాయి. 2021 అక్టోబర్ 1న ప్రారంభమైంది. 2021 అక్టోబర్ 10 ముగుస్తుంది. ఇక ఖాళీల వివరాలలోకి వెళితే.. ఎడ్యుకేషన్ బ్రాంచ్ -5, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్- 30. ఇక అర్హతల విషయం లోకి వెళితే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 కనీసం 70 శాతం మార్కుల తో పాస్ కావాలి.

జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన వాళ్లు దరఖాస్తు చేయాలి. టెన్త్ లేదా ఇంటర్‌లో ఇంగ్లీష్‌ లో 50 శాతం మార్కులు ఉండాలి. వయసు విషయం లోకి వస్తే.. 2002 జూలై 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయాలి. ఇక కోర్సులు వివరాల లోకి వెళితే.. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది.

ఇక ఎలా ఎంపిక చేస్తారు అనేది చూస్తే.. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా లో ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలని https://www.joinindiannavy.gov.in/files/job_instructions/1632288984_459014.pdf
లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news