మెసేజింగ్ యాప్ వాట్సప్.. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కు షాకిచ్చింది. వాట్సప్ నిబంధనలు ఉల్లంఘించాడని.. ఆయన వాట్సప్ అకౌంట్ ను రద్దు చేసింది కంపెనీ. వాట్సప్ కు ఆయన ఖాతా గురించి చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తన వాట్సప్ అకౌంట్ రద్దుపై సీఎం రమేశ్ వాట్సప్ కు మెయిల్ పంపడంతో ఆయనకు వాట్సప్ రిప్లయి పంపించింది. దాంట్లో ఆయన అకౌంట్ ను రద్దు చేయడానికి గల కారణాలను వాట్సప్ వెల్లడించింది.
అయితే.. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరైనా వివాదాస్పద కామెంట్లు, పోస్టులు షేర్ చేస్తే ఆ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వాట్సప్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలు, రాజకీయ నాయకులపై వాట్సప్ నిఘా పెట్టింది. అందులో భాగంగానే వివాదాస్పదంగా ఉన్న సీఎం రమేశ్ వాట్సప్ ఖాతాను బ్లాక్ చేసింది వాట్సప్.