నిజామాబాద్ లో దారుణం..ఇద్ద‌రు బాలిక‌ల‌పై నెల‌రోజులుగా అత్యాచారం..!

-

నిజామాబాద్ లో మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఇటీవ‌ల మ‌ద్యం మ‌త్తులో జిల్లాలో ఓ మ‌హిళ‌పై ఇద్ద‌రు మృగాళ్లు అత్యాచారం చేసి దారుణంగా హ‌త‌మార్చ‌రు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే తాజాగా మ‌రో దారుణం చోటు చేసుకుంది. నగరం లోని పెయింటర్స్ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికపై వసీం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. చాక్ లెట్ ఆశ చూపి వ‌సీ బాలిక‌ల‌పై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత నెల రోజులుగా బాలిక‌ల‌పై వసీం దారుణానికి పాల్ప‌డుతున్నాడు. చికిత్స నిమిత్తం అమ్మాయిలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తల్లి తండ్రుల పిర్యాదు తో నిందితుల‌ను అదుపు లోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతే కాకుండా నింధితుడిపై నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల హైద‌రాబాద్ సింగ‌రేణి కాల‌నీలో ఓ బాలిక పై రాజు అనే మాన‌వ‌మృగం అత్యాచారానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌రికి చేసిన త‌ప్పుకు రైలుకింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారినా దుర్మార్గుల్లో మార్పురాక‌పోవ‌డం బాధాక‌రం.

Read more RELATED
Recommended to you

Latest news