Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు.. అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్ మెంట్కు కేరాఫ్ అడ్రాస్. 19 మంది సభ్యులతో ప్రారంభమైనా.. ఈ రియాలిటీ షోలో ఇప్పటి వరకు నలుగురు ఎలిమినేట్ అయి 15 మంది కంటెస్టెంట్లు మిగిలారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో ఎలిమినేషన్ కు రంగం సిద్దమైంది.
ఈ వారం ఎలిమినేషన్ గండంలో తొమ్మిది మంది కంటెస్టెంట్లు నిలిచారు. అయితే.. నామినేషన్స్‌లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ని ఏకంగా ఎనిమిది మంది టార్గెట్ చేశారు. దీంతో బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక మంది నామినేట్ చేసిన కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
అయితే.. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో అనూష్యం ఫలితాలు వెలువడ్డాయి. షన్ను ను హౌస్ లోని సభ్యులు చీత్కారించినా.. బయట బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో.. తిరుగులేని ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక మానస్, సన్నీలు ఆ తరువాత స్థానంలో నిలిచారు. బుల్లితెర ఫేమస్ యాంకర్ గా పేరున యాంకర్ రవి.. హౌస్ లో తన కాన్నింగ్ గేమింగ్ తో తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్నాడు. చాలా తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. ఇక ప్రియ తన ఆట తీరుతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను రోజురోజుకు పెంచుకుంటుంది.
ఇక మిగిలిన లోబో, విశ్వ, హమీదా, జెస్సీలు .. చాలా తక్కువ ఓట్లు రావడంతో డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. లోబోను ఎలిమినేట్ చేస్తే.. కచ్చితంగా హౌస్‌లో ఫన్ మిస్స్ అవుతుంది. సో లోబో సేవ్ అయినట్లే.. ఇక జెస్సీ.. షో ప్రారంభంలో స్వాతిముత్యంలా ఉన్న మనోడు.. రానురాను అర్జున్ రెడ్డిలా తయారు అవుతున్నాడు. కాంట్రావర్సీలకు కేరాఫ్‌గా నిలిస్తున్నాడు. సో జెస్సీ కూడా సేఫ్ . ఇక మిగిలింది విశ్వ, హమీదా. ఈ ఇద్దరిలో విశ్వ సేవ్ అయ్యి హమీదా పై ఎలిమినేషన్ వేటు పడినట్లు సోషల్ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి.
హమీదా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే పిల్ల.. కానీ కేవలం శ్రీరామ్ చంద్రతోనే చనువుగా ఉండి.. మిగితా వాళ్లకు దూరంగా ఉండటం, ప్రతి విషయంలో శ్రీరామ్‌పై ఆధారపడి ఉండటం.. దీంతో ఆమెపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఒక్కవేళ ఈ వారం హమీదా ఎలిమినేట్ అయితే.. కెప్టెన్ కావాలనుకున్న కల. కల కానే మిగిలిపోతుంది.
హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే.. శ్రీరామ్-హమీదాల లవ్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టే.. కానీ.. లవ్ ట్రాకులకు కేరాఫ్‌లుగా నిలిచిన బిగ్‌బాస్ హౌస్ నుంచి హమీదాను ఎలిమినేట్ చేయడం ఏంటో తెలియక బిగ్ బాస్ ఫాలోవర్స్ చెవులు కొరుక్కుంటున్నారు. హమీదా నిజంగానే ఎలిమినేట్ అయిందా? లేదా? అన్నది క్లారిటీ రావాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!