Megastar Chiranjeevi: వారిని మూలాల‌తో స‌హా పెకలించి.. ఇండ‌స్ట్రీకి దూరంగా పెట్టాలి.. మెగాస్టార్ స‌న్సెష‌న‌ల్ కామెంట్స్.. ఇంత‌కీ ఆ వ్య‌క్తులెవరూ ?

-

Megastar Chiranjeevi: ర‌స‌వ‌త్త‌రంగా సాగిన ‘మా’ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. మా అధ్య‌క్ష పీఠం కోసం సాగిన పోరులో ప్ర‌కాశ్ రాజ్‌ పై మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించాడు. ఈ త‌రుణంలో .. తెలుగు ఇండ‌స్ట్రీలో చీలిక‌లు వ‌చ్చాయ‌ని.. స‌మ‌స్యను ఎవ్వ‌రూ సృష్టించారో? వారిని గుర్తించి.. సినీ పరిశ్ర‌మ‌కు దూరంగా పెట్టాల‌ని మెగాస్టార్ చిరంజీవి స‌న్సెష‌న‌ల్ కామెంట్స్ చేశారు.

శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన పెళ్లిసందD చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితులపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

“న‌టుల మ‌ధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే… ఎలాంటి వివాదాలు, కొట్టుకోవడాలు ఉండ‌వు. ఏ
ప‌ద‌వులు తాత్కాలికం కావు. ఏదైనా సర శాశ్వతం కాదు. రెండెళ్లు.. మూడేళ్లు .. మ‌హాయితే.. నాలుగేళ్లు ఉంటాయి. కాదా.. చిన్న చిన్న పదవుల కోసం.. ఇత‌రుల‌ను మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే.. బయటివాళ్లకు ఎంతటి లోకువ అవుతాం.. ఒక చిన్న పదవి కోసం అంత లోకువ కావాలా ?
ఈ విష‌యంలో ప్ర‌తీ ఒక్కరూ చాలా మెచ్యూరిటీ‏తో, విజ్ఞతతో మాట్లాడాలి.

అంతేతప్పా, మన ఆధిపత్యం కోసం.. ఇత‌రుల‌ను ప్రభావితం చేయ‌కూడ‌దు. అస‌లు సమస్య ఎక్కడ ప్రారంభం అయింది. ఎవ‌రి వ‌ల్ల ఈ వివాదాలు ప్రారంభయ్యాయో ..వాళ్లకు హోమియే వైద్యం చేయించాలి. ఈ వైద్యంలో వ్యాధి మొదళ్లను గుర్తించి.. వైద్యం చేశారు. అలా మూలాల‌తో స‌హా పెకలించి తొలగించాలి. అలాగే.. ఆ స‌మ‌స్య కార‌కుల‌ను గుర్తించాలి. వారిని దూరం పెడితేనే ఇండ‌స్ట్రీ వసుదైక కుటుంబంలా ఉంటుంది. ఆత్మీయంగా, అప్యాయంగా, ప్రేమగా ఉన్న‌ప్పుడే.. అవతలివారికి లోకువ కాకుండా ఉంటాం. ముఖ్యంగా మీడియా వారికి మనం ఆహారం అయిపోకూడదు ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇంత‌కూ చిరంజీవి ఎవ‌రి గురించి మాట్లాడారు? ఎవ‌రిని మూలాల‌తో స‌హా పెకలించాలి? అస‌లు ఎవ‌రిని ఇండ‌స్ట్రీకి దూరంగా పెట్టాలి? ఇంత‌కీ ఆ వ్య‌క్తులెవరూ ? అనే ప్ర‌శ్నలు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయనం మారాయి. చిరంజీవి మాట్లాడిన అంశాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news